Saturday, January 25, 2014

'అతీ సర్వత్ర వర్జయేత్ '

''అతీ సర్వత్ర వర్జయేత్ '' అని మన పెద్దవాళ్ళు అంటుంటారు.అనగా ఏ విషయంలోనైనా అతి పనికిరాదు, అతిగా ఉండటం వల్ల, ప్రవర్తించడం వల్ల , మాట్లాడటం వల్ల అనర్ధం జరుగుతుందని వారి భావం. అయితే....'ఆతీ సర్వత్ర వర్జయేత్ ' అన్న పాదం కన్నా ముందు మూడు పాదాలు ఉన్నాయి, అవి
శ్లో.అతి రూపా ధృతా సీతా
అతి గర్వాత్ రావానో హతః
అతి దానాత్ బలిర్బద్ధః
'అతీ సర్వత్ర వర్జయేత్ '

సీత అతి సుందరంగా ఉండటం వలన అపహరించబడింది, రావణుడు అతి గర్వం చేత చంపబడ్డాడు, బలి చక్త్రవర్తి అతిగా దానం చేయడంవల్ల వామనుడి చేత పాతాళానికి అనగా తొక్కబడ్డాడు. అందుకే అన్నివేళలా అతిని వదిలేయాలి.

Sunday, January 12, 2014

సంక్రాంతి

OM NAMO VENKATESA

 http://upload.wikimedia.org/wikipedia/commons/5/53/Tirumala_gopurams.JPG
1. శ్రీ శ్రీనివాస గోవిందా 68. విరోదిమర్దన గోవిందా
2. శ్రీ వేంకటేశా గోవిందా 69. గోవిందా హరి గోవిందా
3. భక్తవత్సలా గోవిందా 70. గోకులనందన గోవిందా
4. భాగవతప్రియ గోవిందా 71. సాలగ్రామధర గోవిందా
5. నిత్యనిర్మలా గోవిందా 72. సహస్రనామా గోవిందా
6. నీలమేగశ్యామ గోవిందా 73. లక్ష్మీవల్లభ గోవిందా
7. పురాణపురుష గోవిందా 74. లక్ష్మణాగ్రజ గోవిందా
8. పుండరీకాక్ష గోవిందా 75. కస్తూరితిలక గోవిందా
9. గోవిందా హరి గోవిందా 76. కాంచనాంబరధర గోవిందా
10. గోకులనందన గోవిందా 77. గరుడవాహన గోవిందా
11. నందనందనా గోవిందా 78. గజరాజరక్షక గోవిందా
12. నవనీతచోర గోవిందా 79. గోవిందా హరి గోవిందా
13. పశుపాలక శ్రీగోవిందా 80. గోకులనందన గోవిందా
14. పాపవిమోచన గోవిందా 81. వానరసేవిత గోవిందా
15. దుష్టసంహార గోవిందా 82. వారధిబంధన గోవిందా
16. దురిత నివారణ గోవిందా 83. ఏడుకొండలవాడ గోవిందా
17. శిష్ట పరిపాలక గోవిందా 84. ఏకస్వరూపా గోవిందా
18. కష్ట నివారణ గోవిందా 85. శ్రీరామకృష్ణా గోవిందా
19. గోవిందా హరి గోవిందా 86. రఘుకులనందన గోవిందా
20. గోకులనందన గోవిందా 87. ప్రత్యక్షదేవా గోవిందా
21. వజ్రమకుటధర గోవిందా 88. పరమదయాకర గోవిందా
22. వరాహమూర్తివి గోవిందా 89. గోవిందా హరి గోవిందా
23. గోపిజనలోల గోవిందా 90. గోకులనందన గోవిందా
24. గోవర్ధనోద్ధార గోవిందా 91. వజ్రకవచధర గోవిందా
25. దశరధనందన గోవిందా 92. వైజయంతిమాల గోవిందా
26. దశముఖ మర్దన గోవిందా 93. వడ్డికాసులవాడ గోవిందా
27. పక్షివాహన గోవిందా 94. వసుదేవ తనయా గోవిందా
28. పాండవప్రియ గోవిందా 95. బిల్వపత్రార్చిత గోవిందా
29. గోవిందా హరి గోవిందా 96. భిక్షుక సంస్తుత గోవిందా
30. గోకులనందన గోవిందా 97. స్త్రీపుంరూపా గోవిందా
31. మత్స్యకూర్మా గోవిందా 98. శివకేశవమూర్తి గోవిందా
32. మధుసూదన హరి గోవిందా 99. బ్రహాండరూపా గోవిందా
33. వరాహ నరసింహ గోవిందా 100. భక్త రక్షక గోవిందా
34. వామన భృగురామ గోవిందా 101. గోవిందా హరిగోవిందా
35. బలరామానుజ గోవిందా 102. గోకులనందన గోవిందా
36. బౌద్దకల్కిధర గోవిందా 103. నిత్యకళ్యాణ గోవిందా
37. వేణుగాన ప్రియ గోవిందా 104. నీరజనాభ గోవిందా
38. వేంకటరమణా గోవిందా 105. హాతీరామప్రియ గోవిందా
39. గోవిందా హరి గోవిందా 106. హరిసర్వోత్తమ గోవిందా
40. గోకులనందన గోవిందా 107. జనార్దనమూర్తి గోవిందా
41. సీతానాయక గోవిందా 108. జగత్సాక్షిరూపా గోవిందా
42. శ్రితపరిపాలక గోవిందా 109. అభిషేకప్రియ గోవిందా
43. దరిద్రజనపోషక గోవిందా 110. ఆపన్నివారణ గోవిందా
44. ధర్మసంస్థాపక గోవిందా 111. గోవిందా హరి గోవిందా
45. అనాధ రక్షక గోవిందా 112. గోకులనందన గోవిందా
46. ఆపద్భాందవ గోవిందా 113. రత్నకిరీట గోవిందా
47. శరణాగతవత్సల గోవిందా 114. రామానుజనుత గోవిందా
48. కరుణాసాగర గోవిందా 115. స్వయం ప్రకాశ గోవిందా
49. గోవిందా హరి గోవిందా 116. ఆశ్రితపక్ష గోవిందా
50. గోకులనందన గోవిందా 117. నిత్యశుభప్రద గోవిందా
51. కమలదళాక్ష గోవిందా 118. నిఖిలలోకేశా గోవిందా
52. కామితఫలదాతా గోవిందా 119. ఆనందరూపా గోవిందా
53. పాపావినాశక గోవిందా 120. ఆద్యంతరహితా గోవిందా
54. పాహిమురారే గోవిందా 121. గోవిందా హరి గోవిందా
55. శ్రీముద్రాంకిత గోవిందా 122. గోకులనందన గోవిందా
56. శ్రీవత్సాంకిత గోవిందా 123. ఇహపరదాయక గోవిందా
57. ధరణీనాయక గోవిందా 124. ఇభరాజరక్షక గోవిందా
58. దినకరతేజా గోవిందా 125. పరమదయాళో గోవిందా
59. గోవిందా హరి గోవిందా 126. పద్మనాభ హరి గోవిందా
60. గోకులనందన గోవిందా 127. తిరుమలవాసా గోవిందా
61. పద్మావతీప్రియ గోవిందా 128. తులసీ వనమాల గోవిందా
62. ప్రసన్నమూర్తీ గోవిందా 129. శేషాద్రినిలయ గోవిందా
63. అభయహస్త ప్రదర్శన గోవిందా 130. శేష శాయిని గోవిందా
64. మర్త్యావతారా గోవిందా 131. శ్రీనివాస శ్రీ గోవిందా
65. శంకచక్రధర గోవిందా 132. శ్రీవేంకటేశా గోవిందా
66. శార్జగదాధర గోవిందా 133. గోవిందా హరి గోవిందా
67. విరజా తీర్థస గోవిందా 134. గోకులనందన గోవిందా

ముక్కోటి ఏకాదశి

webvedam_maha vishnu

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. (నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. ‘భగవద్గీతా’ పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
పండుగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. ‘లంకణం పరమౌషధ’మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.
పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానిమురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు ‘ఏకాదశి’ అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు(కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
ముక్కోటి ఏకాదశి వ్రతమాచరిస్తే మరు జన్మంటూ ఉండదట!  :-అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.
***ఓం నమో నారాయణాయా… ఓం నమో నారాయణాయా…ఓం నమో నారాయణాయా…***

వైకుంట ఏకాదశి




 ఒకనాటి వైకుంట ఏకాదశినాడు నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు ప్రభు నేను పుట్టిన క్షణం నుంచి మీ నమ స్మరణే చెస్తునాను సంసారం భంధాలలో చిక్కుకొండ సన్యాసం స్వికరించాను మీ భక్త బృందం లో నేనే కదా ఉత్తమ్మ భక్తుడను అన్నాడు నారదుడు, నారాయణుడు చిద్విలాసం చేసి నారద నీ ప్రశ్న కు సమాధానం చెప్తాను కాని ముందు ఈ కథ విను తరువాత నీకే అర్థం అవుతుంది ఒక పల్లెటూరిలో విష్ణుదాసుడు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న తముడు చెల్లి ఉన్నారు అతని సంపాదన పైన వారి కుటుంబం ఆధారపడి ఉంది, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు పూటలా అన్నం వాళ్ళ మనుషులకు పెట్టడానికి 18గంటలు పనిచేస్తుంటాడు చెల్లి కి పెళ్లి చేస్తాడు, తముడు కి వ్యాపారం పెట్టించాడు తల్లి తండ్రులకు మంచి వైద్యం అందించాడు భార్య బిడ్డలకు ఏ కొరత రానీకుండా చుసుకునాడు అతనే నాకు ఇష్టమైన భక్తుడు అనడు విష్ణు దేవులు, నారదుడు ఇలా ఆశ్చర్యం తో ఇలా అడిగాడు ప్రభు విష్ణుదాసుడు ఎలా మీ భక్తుడు అయ్యాడు మీ కోసం ఉపవాసాలు చేయలేదు గుడి గోపురాలు తిరగలేదు అర్చన అభిషేకాలు చేయలేదు మరి ఎలా మీ ఇష్ట భక్తుడు అయ్యాడు అని ప్రశ్నించాడు నారదుడు నారద నా భక్తుడు కావాలి అంటే నా కోసం గుడి కట్టకర్లేదు ఉపవాసాలు అర్చన అభిషేకాలు యజ్ఞాలు చేయకర్లేదు, ఒకటి చేస్తే చాలు అది ఏమిటి అంటే నా కుటుంభం అంటే విశ్వం నేను ఇచ్చిన భంధాలు అంటే అమ్మ నాన్న భార్య భర్త కొడుకు కూతురు సోదరి సోదరులు ఇలా నేను వేసిన జీవాత్మ సంకెళ్ళను సునితంగా విపుకోవాలి, అది ఎలా అంటే ప్రతి ఒకరి లో నన్ను చూడటం ప్రతి ఒక్క భందానికి న్యాయం చేయటం నేను ఇచ్చిన భంధాలలో నన్నే చూసుకొని వారికీ నిర్వర్తించే భాధ్యతని నా సేవ కైకర్యం అనుకోని నాకు అర్పిస్తే చాలు నేను ఆనందిస్తాను నిరంతం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటె చాలు వారి వెంటే నేను ఉంటాను ఇలానే విష్ణు దాసుడు నాకు ఇష్ట భక్తుడు అయ్యాడు నా పైన నిందలు వేయలేదు భందాలను ఇచ్చినందుకు నా పైన చిరాకు చూపలేదు పిలిచినా నేను పలుకనందుకు భక్తి తో భంధలా కర్మలను అనుభవిస్తూ నన్ను ధ్యానించాడు నన్ను శరణు వెడుతూనే వారి కుటుంబ వ్యక్తులకు న్యాయం చేసాడు విష్ణు దాసుడు చేసి చూపిన భక్తి అంటే నాకు ఇష్టం నారదః అన్నారు విష్ణు దేవులవారు. స్నేహితులారా మనకు స్వర్గం నరకం ఎక్కడో లేదు ఎదుటి వారికీ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమనే తిరిగి వస్తుంది ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి వస్తుంది దీనికి మనం భగవంతుడ్ని తిట్టడం లేదా మన భక్తి తో దేవుడ్ని బయపెట్టడం చేయకూడదు మన భందాలను గౌరవిదాం ప్రేమిదాం సేవిదాం భగవంతునికి ఇష్టులం అవుదాం -

OM SAI RAM

భీమాంజనేయులు -శ్రీ మహాభారతంలో కథలు

భీమాంజనేయులు -శ్రీ మహాభారతంలో కథలు

దివ్యాస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయపర్వతాలకు వెళ్ళాడు.

గాండీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచాలి, పాండవులు. సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలి పెట్టి మరెక్కడికైనా తరలివెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి వెంటనే బయలుదేరి నారాయణాశ్రమవనం చేరుకుని కొన్నాళ్ళు కాలం గడిపారు. ఒకనాడు ఉత్తర దిశనుంచి చల్లని పిల్లగాలి వీచింది. ఆ గాలితోపాటూ దివ్యపరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి దౌపతి ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది.

"భీమసేనా! ఈ పువ్వు చూడు. ఎంత సువాసన! ఎంత అందం!! ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్యకవనంలో వేసి పెంచుకుందాం. ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి" అంది.

దౌప్రతి కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు వున్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు.

అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి, "నా ఒళ్ళు బాగాలేదు. పడుకున్నాను. కదలలేను. పిచ్చిపిచ్చిగా శబ్దాలు చెయ్యకు. వివేకం గల మునుష్యులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఎక్కడికి పోదామని వచ్చావు? ఇది దేవలోకానికి పోయే మార్గం. మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు. తిరిగి వచ్చిన దోవనే వెళ్ళిపో" అంది.

వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది. "అసలు నువ్వెవరు? నన్నడ్డగించడానికి నీకు గల అధికారమేమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి. వాయునందనుడ్ని అని తెలుసుకో. దారి ఇవ్వు" అని బిగ్గరగా గర్జించాడు.

"నేను ఒక సాధారణమైన కోతినే. కాని నువ్వీ దారిన వెళితే దెబ్బతింటావు. జాగ్రత్త" అంది వానరం.

"నీ సలహా నాకు అక్కర్లేదు. మర్యాదగా తప్పుకో" అన్నాడు భీముడు.

"నాకు లేవడనికి శక్తి లేదు. నేను ముసలుదాన్ని . కాదూ, కూడదూ అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు" అంది వానరం.

"జంతువులను దాటి పోగూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లఘించినట్టు, నిన్నూ ఈ పర్వతాన్నీ ఒక్క ఉదుటున దాటిపోగలను ఏమనుకున్నావో!" అన్నాడు భీముడు గొప్పగా.

"నాయనా! కోపం తగ్గించుకో. గొప్పలకు పోకు. ముసలివాణ్ణని ముందే చెప్పాను. నిలిచే శక్తి లేదు. నా మీదినుంచి దాటిపోవటానికి ఆక్షేపణ వుంటే, దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకుని వెళ్ళు" అంది వానరం.

తన భుజబలం చూసి గర్వపడుతున్న భీముడు 'అదెంత పని!' అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు. కాని ఆ వాలం కదల్లేదు. భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. తోక పైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు. ఆ క్షణంలో భీముడికి ఎదుటవున్నది సామాన్య వానరం కాదని అర్థమైంది.

"అయ్యా ! నన్ను మన్నించండి. మీరెవరు? సిద్ధులా? దేవతలా? గంధర్వులా? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి" అని వేడుకున్నాడు.

"పాండవవీరా! సర్వలోకాలకూ ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుడ్ని , హనుమంతుడ్ని నేనే. యక్షులూ, రాక్షసులూ సంచరించే ఈ తో్వలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సౌగంధ వృక్షం- అదిగో కనిపిస్తోంది చూడు" అని భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు.

మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమ అంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి. "వీరుడా! నీ నివాసానికి తిరిగిపొ. అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో. నీకు మేలు జరుగుతుంది. నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను. నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండాపైన నేనుంటాను. మీకు జయం కలుగుతుంది" అని దీవించాడు హనుమంతుడు.

భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలన్నీ కోసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు భీముడు.

Symptoms of Spiritual Awakening.

Importance of Sankranthi

సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది.
నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.

సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.

కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.

JAI GENESHA

Funny Laws of Life and others

  1. Funny Laws of Life
    --------------------------------
    Law of equality : The time taken by a wife when she says I'll get ready in 5 min is exactly equal to the time taken by husband when he says 'I'll cal u in 5 min!

    Law of Queue: If you change queues, the one you have left will start to move faster than the one you are in now.

    Law of Telephone: When you dial a wrong number, you never get a busy tone.

    Law of Mechanical Repair: After your hands become coated with grease, your nose will begin to itch.

    Law of the Workshop: Any tool, when dropped, will roll to the least accessible corner.

    Bath Theorem: When the body is immersed in water, the telephone rings.

    Law of Encounters: The probability of meeting someone you know increases when you are with someone you don't want to be seen with.

    Law of the Result: When you try to prove to someone that a machine won't work, it will.

    Law of Bio mechanics: The severity of the itch is inversely proportional to the reach.

    Theater Rule: People with the seats at the farthest from the screen arrive last.

    Law of Coffee: As soon as you sit down for a cup of hot coffee, your boss will ask you to do something which will last until the coffee is cold.

    Law of Proposal : After u accept a proposal you will get a better one..
    31Like · · Promote ·
  2. Some Good Thoughts
    ---------------------------

    1. When Snake is alive, Snake eats Ants.
    When Snake is dead, Ants eat Snake.
    Time can turn at any time.
    Don't neglect anyone in your life........ ...

    2. Never make the same mistake twice,
    There are so many new ones,...
    See More
    72Like · · Promote ·
  3. ♧ Some Amazing and Unknown Facts ❀

    ★ Ants never sleep!
    ★ When the moon is directly overhead, you will weigh slightly less.
    ★ Alexander Graham Bell, the inventor of the telephone, never called his wife or mother; because they were both deaf.
    ★ An ostrich’s eye is bigger than its brain.
    ★ “I Am” is the shortest complete sentence in the English language.
    ★ Babies are born without knee caps – actuall...
    See More
    1Like · · Promote ·
  4. HappY BirthdaY to Narendra Modi and Grand Salute — with Vaibhav Dongre and 46 others.
  5. 5 THINGS YOU PROBABLY NEVER KNEW YOUR MOBILE PHONE COULD DO.

    There are a few things that can be done in times of grave emergencies. . Your mobile phone can actually be a life saver or an emergency tool for survival. Check out the things that you can do with it:

    FIRST: Emergency

    The Emergency Number worldwide for Mobile is 112. If you find yourself out of the coverage area of your mobile; ...
    See More
    22Like · · Promote ·
  6. GOD & SPIDER

    Once a soldier during war lost his way and entered near enemy's camp. He could hear enemy soldiers coming in his direction. Scrambling for cover, he found his way up a high ridge to several small caves in the rock. Quickly he crawled inside one of the caves.

    Although safe for the moment, he realized that once the enemy soldiers looking for him swept up the ridge, they would quickl...
    See More
    21Like · · Promote ·
  7. wat u say??

    admin@vishal tinku
    — with Priyanka Mishra and 31 others.
  8. jai prakash narayan loksatta _/\_
    31Like · · Promote ·
  9. On the divine occasion of Guru Pournima on 22-07-2013, Monday, I pray lord Sainath of Shirdi to shower His choicest Blessings on all.

    On this occasion, let us rededicate ourselves at the Lotus feet of Lord.

Today's Reality

List of Important things in life

List Of "DO's" & "DONT's" In LIFE:
(Worth Reading)

************************

Never Share Ur Secrets with Anyone.
This can be Self-Destructive,
Perhaps the most Important Advice in Life.

************************
🐊 Never Tell Ur Problems to Anyone.
20% will not Care
&
80% will be Glad that U have Them.

************************
🐊 Life is similar to Boxing Game.
Defeat is not Declared when U Fall Down.
It is Declared when U Refuse to Get Up.

************************
🐊 Always WRONG PERSONS Teach the
RIGHT LESSONS in Life.
That is called LIFE EXPERIENCE.

************************
🐊 Faith is taking the 1st Step,
even when U dont see the whole Staircase.

************************
🐊 Keep Ur Face to the Sun,
& U will not see the Shadow.

************************
🐊 Everything is Valuable only at 2 Times:
1: Before Getting It.
&
2: After Losing It.

************************
🐊 2 Things brings Happiness & Success
in Life:
1: The way U Manage
when U have Nothing.
&
2: The way U Behave
when U have Everything.

************************
🐊 2 Places are most Valuable in the World:
1: The NICEST Place is to be in
Someone's Thoughts.
&
2: The SAFEST Place is to be in
Someone's Prayers.

************************
🐊 'FEAR' has 2 Meanings:
1: Forget Everything & Run.
&
2: Face Everything & Rejoice.
Choice is Ours.

************************
🐊 ATTITUDE at its Best:
"My BACK is not a VOICE MAIL.
Kindly Say whatever U have by FACING ME".

************************
🐊 What is SUCCESS ?
SUCCESS is, when Ur Photo's are Uploaded on 'GOOGLE' instead of FACEBOOK.

************************
🐊 'EGO' is the only Requirement
to Destroy any Relationship.
Be a Bigger Person,
Skip the 'E' & let it 'GO'.

************************
🐊 Do U know why God did not give Us
the Gift to Read Other's Mind ?
So that, We could have the Chances to
'TRUST' & Privilege to be 'TRUSTED'.

************************
🐊 As long as We do not Forgive People
who have Hurt Us,
They Occupy a 'RENT-FREE-SPACE'
in our Mind.

************************
🐊 Always keep Hoping for Good.
Keep a Green Tree in Ur Heart.
The Singing Birds will Automatically come.

************************
🐊 If U Walk the Way guided by Humans,
U will find a Hopeless End.
BUT
If U will Walk the Way guided by GOD,
U will find Endless Hopes & Opportunities.

************************
🐊 GOD always likes to know again & again
what U want.
It is not that He Forgets Ur
Dreams & Prayers,
But He Loves to Check Ur Passion
towards Ur Desire.
That is why He wants U to have Ur
'QUIET TIME' which We call as
'PRAYER TIME' with Him everyday.

************************
🐊 I asked GOD: If everything is already Written in Destiny,
then why should I Pray ?
GOD Smiled & said: I have also Written
'CONDITIONS APPLY'.

************************
🐊 Empty Pockets Teach
Millons of Things in Life.
BUT
Full Pockets Spoil Us in Million Ways.

************************
🐊 TRUST is like a Sticker.
Once it is Removed, it may Stick again,
but not as Strong as it Holds
when U First Applied.

************************
🐊 Always take Care of RELATIONS.
Thats why they say, when U are in Doubt,
'SILENCE' is the Best Policy.

************************
🐊 Never Win People with Arguments.
rather Defeat Them with Ur Smile.
Because People who always Wish to
Argue with U, cannot Bear Ur SILENCE.

************************
🐊 If a Drop of Water falls on a Lake,
its Identity is Lost.
BUT
If a Drop of Water falls on a Lotus Leaf,
it Shines like a Pearl.
Drop is the Same,
but the 'COMPANY' matters.

************************
🐊 Our HOPES should be like HAIR & NAILS.
No matter how many times they get Cut,
but they never stop Growing.
That is why they say,
Always Hope for the Best,
however Bad the Situation may be.

************************
🐊 'MEMORIES' are always Special.
Sometimes, We Laugh by
Remembering the days We Cried.
&
Sometimes, We Cry by
Remembering the days We Laughed.
Thats LIFE.

************************
🐊 SEA is common for All.
Some take Pearls,
Some take Fishes,
Some come out just with Wet Legs.
Word is common to all

My Recent visit Photos at Delhi

RULES OF LIFE

RULES OF LIFE
-------------------

Bill Gates recently gave a speech at a High School about eleven (11) things they did not and will not learn in school.

He talks about how feel-good, politically correct teachings created a generation of kids with no concept of reality and how this concept set them up for failure in the real world.

Rule 1 : Life is not fair - get used to

Rule 2 : The world doesn't care about your self-esteem. The world will expect you to accomplish something BEFORE you feel good about yourself.

Rule 3 : You will NOT make $60,000 a year right out of high school. You won't be a vice-president with a car phone until you earn both.

Rule 4 : If you think your teacher is tough, wait till you get a boss.

Rule 5 : Flipping burgers is not beneath your dignity. Your Grandparents had a different word for burger flipping: They called it opportunity.

Rule 6 : If you mess up, it's not your parents' fault, so don't whine about your mistakes, learn from them.

Rule 7 : Before you were born, your parents weren't as boring as they are now. They got that way from paying your bills, cleaning your clothes and listening to you
talk about how cool you thought you were: So before you save the rain forest from the parasites of your parent's generation, try delousing the closet in your own room..

Rule 8 : Your school may have done away with winners and losers, but life HAS NOT. In some schools, they have abolished failing grades and they'll give you as MANY TIMES as you want to get the right answer.
*This doesn't bear the slightest resemblance to ANYTHING in real life.

Rule 9 : Life is not divided into semesters. You don't get summers off and very few employers are interested in helping you FIND YOURSELF. *Do that on your own time.

Rule 10 : Television is NOT real life. In real life people actually have to leave the coffee shop and go to jobs.

Rule 11 : Be nice to nerds. Chances are you'll end up working for one..

If you can read this... Thank a Teacher.

If you can read this in English... Thank a Soldier!

And for life and everything else you have... Thank God!!

AADHAR CARD - HAPPY READING FOR FUN

AADHAR CARD - HAPPPY READING - FOR FUN
A Scene in 2020...
Operator:Hello Pizza Hut!
Customer: Hello, can you please take my order?
Operator : Can I have your multi purpose Aadhar
card number first, Sir?
Customer: Yeah!
Hold on..... My number is 889861356102049998-45-54610
Operator : OK... you're... Mr Singh and you're calling from 17 Jalan Kayu. Your home number is 40942366, your office 76452302 and your mobile is 0142662566. You are calling from you home number now.
Customer: (Astonished) How did you get all my phone numbers?
Operator : We are connected to the system, Sir.
Customer: I wish to order your Seafood Pizza...
Operator : That's not a good idea Sir.
Customer: How come?
Operator : According to your medical records, you have high blood pressure and even higher cholesterol level, sir.
Customer: What?... What do you recommend then?
Operator : Try our Low Fat Hokkien Mee Pizza. You'll like it.
Customer: How do you know for sure?
Operator : You borrowed a book titled 'Popular Hokkien Dishes' from the National Library last week, sir.
Customer: OK I give up... Give me three family suize ones then.
Operator : That should be enough for your family of 10, Sir. The total is Rs. 2,450.
Customer: Can I pay by credit card?
Operator : I'm afraid you have to pay us cash, Sir. Your credit card is over the limit and you owe your
bank Rs. 1,51,758 since October last year. That's not including the late payment charges on your
housing loan, Sir.
Customer: I guess I have to run to the neighbourhood ATM and withdraw some cash
before your guy arrives.
Operator : You can't Sir. Based on the records, you've exhausted even your overdraft limit.
Customer: Never mind just send the pizzas, I'll have the cash ready. How long is it gonna take
anyway?
Operator : About 45 minutes Sir, but if you can't wait you can always come and collect it on your
motorcycle.
Customer: What?
Operator : According to the details in the system , you own a motorcycle registration number 1123.
Customer: "????" (hmmm.. these guys know my motorcyle number too!)
Operator : Is there anything else, sir?
Customer: Nothing.! .. by the way... aren't you giving me that 3 free bottles of cola as advertised?
Operator : We normally would sir, but based on your records, you're also diabetic... In the best
interest of your health, we are holding this offer for you.
Customer: teri
Operator: Better mind your language sir. Remember on 15th July 2007 you were imprisoned for 2
months and fined Rs.5,000 for using abusive language against a policeman...?

Customer faints.. aur banao Aadhar Card.....

Funny

URGENTLY NEEDED

URGENTLY NEEDED
----------------------
An ELECTRICIAN
..to restore the current between people that do not speak to each other anymore.

An OPTICIAN
..to change the outlook of people.

An ARTIST
..to draw a smile on everyone's face.

A CONSTRUCTION WORKER
..to build peace.

A GARDENER
...to cultivate good thoughts.
& lastly...

A MATHS TEACHER
...for us all to relearn how to count on each other...

Useful information


ATTENTION: MUST SHARE AS SOON AS POSSIBLE Please take this very seriously. People have been receiving calls from+375602605281, +37127913091or any number starting from +375, +371 number one ring & hang up. If you call back 

 Photo: Useful info:
ATTENTION: MUST SHARE AS SOON AS POSSIBLE Please take this very seriously. People have been receiving calls from+375602605281, +37127913091or any number starting from +375, +371 number one ring & hang up. If you call back it's one of those Numbers that are charged 15-30 Rs & they can copy ur contact list in 3sec & if u have bank or credit card details on your phone, they can copy that too. +375 is from Belarus.. 371 is code for Latvia... Don't answer or call back. Please FORWARD AND SHARE this to your friends and family.

Thanks all

Thank you very much my dear friends and relatives for your lovely & affectionate wishes on my Birthday (today). Really it is wonder to receive many blessings & wishes on this day. Thanks all for remembering. It gave me enough power and vigor for serving more and more. Thanks one and all.

I Pray Lord Sainath of Shirdi to Shower His Choicest Blessing on all of us.
Yours
K.V.SrinivasaRao
-------------------

Important Health Tips

Must Read and share

ప్రతీ అబ్బాయీ, అమ్మాయి తప్పక చదవండి Must Read & Share

"ఒరేయ్.. ఒసేయ్.." అని సినిమాల్ని చూసి inspire అయి మాట్లాడుకోవడం.. ఛాట్ చేసుకోవడం సరదాగానే ఉంటుంది..

కానీ ఆ సరదా జీవితాల్ని బలి తీసుకుంటోంది...

ఇవ్వాళ ఒకమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం డీల్ చెయ్యాల్సి వచ్చింది.. ఇలాంటివి ఇప్పటికి ఓ పదీ, పదిహేను కేసులు నా దృష్టికి వచ్చాయి..

ఆ అమ్మాయి పెళ్లయి నెలన్నర మాత్రమే అయింది... పెళ్లవగానే భర్త సింగపూర్‌ వెళ్లిపోయాడు, భార్యని తర్వాత తీసుకు వెళ్లే ప్లాన్‌తో. అంతలో ఈ అమ్మాయి మెయిల్, ఐడి, పాస్‌వర్డ్ ద్వారా పాత ఛాట్ హిస్టరీ మొత్తం తిరగేస్తే ఓ అబ్బాయితో ఛాట్ చేసిన మాటలు సమస్య సృష్టించాయి. "ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా" అని అనుమానం మొదలెట్టాడు.

--------------------

ఇక్కడ ఎవ్వడికీ జీవితంపై బాధ్యత లేదు.. అమ్మాయిలకు తలనొప్పి వస్తే జండూబామ్‌లు రాసే బాయ్ ఫ్రెండ్స్ కావాలి.. అబ్బాయిలకు కొద్దిగా రొమాంటింగ్‌గా మాట్లాడడానికి కోపరేట్ చేసే అమ్మాయిలు కావాలి... ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆ మాటలు ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఎవడికీ పట్టదు!!

రేపు పెళ్లయ్యాక మీ భార్య ఇలాగే వేరొకరితో మాట్లాడి ఉందీ అని తెలిస్తే తట్టుకోవడం అబ్బాయిలకు సాధ్యమవుతుందా? మీ భార్యల్ని క్షమించలేని వాళ్లు ఎవరో ముక్కూ మొహం తెలీని అమ్మాయిలతో ఎందుకు మాటల్లోనే మానసిక వ్యభిచారం చేసేస్తారు?

అమ్మాయిలూ ఏం తక్కువ తినట్లేదు.. మంచిగా, బుద్ధిగా ఉండేవాళ్లు అమ్మాయిలకు నచ్చట్లేదు. కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి... ఎంత అడ్వాన్స్‌డ్ అంటే సినిమాలకూ, షికార్లకీ తిప్పుతూ ముద్దులూ, హగ్‌లూ ఇచ్చే బాపతు జనాలే నచ్చుతున్నారు.. ఏ మూమెంటో కాలు జారినా ఫర్లేదు.. నష్టం ఏం లేదు..

----------

సిగ్గుపడాల్సి వస్తోంది భారతదేశ పతనాన్ని చూసి! తమ జీవితాల్ని తామే సర్వనాశనం చేసుకుంటున్న యువతని చూసి!!

-----------------

కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ, మొబైల్ ఫోన్లూ, ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నది విచ్చలవిడిగా ఏదిబడితే అది మాట్లాడుకోవడానికి కాదు.. అలా మాట్లాడుకోవడం సరదానూ కాదు.. అలాంటి మాటలే రేపు మీ జీవితాలకు ఉరితాళ్లు కాబోతున్నాయి.

మీరేం చేయాల్సిన పనిలేదు.. చనువుగా ఒక్క వ్యక్తితో మాట్లాడితే చాలు.. అనుమానం ఇట్టే పుట్టుకొస్తుంది.. మీ భార్యా, మీ భర్తా మిమ్మల్ని అనుమానించినంత మాత్రాన వాళ్లు ఇరుకైన ఆలోచనలు కలిగిన వాళ్లూ కాదూ.. మీరు విశాల హృదయులూ కాదు. ఈ సిస్టమ్ ఇంతే... మీరేదో గొప్ప అని ఫీలవకండి... మీ పార్టనర్ అనుమానించకుండా గౌరవంగా ఉండాల్సిన బాధ్యతా మీది, మీ పార్టనర్‌కి అనుమానం వచ్చినా మీ ప్రవర్తనతో సంభాళించుకుని మళ్లీ మామూలు అవ్వాల్సిన బాధ్యతా మీ పార్టనర్‌ది.

అంతే గానీ.. "వాడెడడు నన్ను అనుమానించడానికి.. నిన్నగాక మొన్న తాళికట్టాడు.. నాకు ఈ మనిషే వద్దు.. నేను సంపాదించుకోవట్లేదా.. నా బ్రతుకు బ్రతకలేనా.." అని ఏటిట్యూడ్ చూపించదలుచుకున్నారా? మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్లు! చేయాల్సిదంతా మీరే చేసి తప్పు ఎవరిదో అన్నట్లు ఉండడం ఎలా కరెక్ట్?

----------------------

చివరిగా ఒక్క మాట...

ఈ దేశంలో కొన్ని కోట్ల దంపతులు జీవితాంతం కలిసి ఉన్నారు తరతరాల నుండీ... కలిసి బ్రతకడానికీ, కుటుంబ వైవాహిక జీవనానికీ అర్థం నేర్పిందీ సంస్కృతి.. దీన్ని మీ అజ్ఞానంతో రోజుకో మనిషితో కలిసి బ్రతికే దారుణమైన స్థితికి దిగజార్చకండి.

- నల్లమోతు శ్రీధర్