

ఒకనాటి వైకుంట ఏకాదశినాడు నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు ప్రభు నేను పుట్టిన క్షణం నుంచి మీ నమ స్మరణే చెస్తునాను సంసారం భంధాలలో చిక్కుకొండ సన్యాసం స్వికరించాను మీ భక్త బృందం లో నేనే కదా ఉత్తమ్మ భక్తుడను అన్నాడు నారదుడు, నారాయణుడు చిద్విలాసం చేసి నారద నీ ప్రశ్న కు సమాధానం చెప్తాను కాని ముందు ఈ కథ విను తరువాత నీకే అర్థం అవుతుంది ఒక పల్లెటూరిలో విష్ణుదాసుడు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న తముడు చెల్లి ఉన్నారు అతని సంపాదన పైన వారి కుటుంబం ఆధారపడి ఉంది, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు పూటలా అన్నం వాళ్ళ మనుషులకు పెట్టడానికి 18గంటలు పనిచేస్తుంటాడు చెల్లి కి పెళ్లి చేస్తాడు, తముడు కి వ్యాపారం పెట్టించాడు తల్లి తండ్రులకు మంచి వైద్యం అందించాడు భార్య బిడ్డలకు ఏ కొరత రానీకుండా చుసుకునాడు అతనే నాకు ఇష్టమైన భక్తుడు అనడు విష్ణు దేవులు, నారదుడు ఇలా ఆశ్చర్యం తో ఇలా అడిగాడు ప్రభు విష్ణుదాసుడు ఎలా మీ భక్తుడు అయ్యాడు మీ కోసం ఉపవాసాలు చేయలేదు గుడి గోపురాలు తిరగలేదు అర్చన అభిషేకాలు చేయలేదు మరి ఎలా మీ ఇష్ట భక్తుడు అయ్యాడు అని ప్రశ్నించాడు నారదుడు నారద నా భక్తుడు కావాలి అంటే నా కోసం గుడి కట్టకర్లేదు ఉపవాసాలు అర్చన అభిషేకాలు యజ్ఞాలు చేయకర్లేదు, ఒకటి చేస్తే చాలు అది ఏమిటి అంటే నా కుటుంభం అంటే విశ్వం నేను ఇచ్చిన భంధాలు అంటే అమ్మ నాన్న భార్య భర్త కొడుకు కూతురు సోదరి సోదరులు ఇలా నేను వేసిన జీవాత్మ సంకెళ్ళను సునితంగా విపుకోవాలి, అది ఎలా అంటే ప్రతి ఒకరి లో నన్ను చూడటం ప్రతి ఒక్క భందానికి న్యాయం చేయటం నేను ఇచ్చిన భంధాలలో నన్నే చూసుకొని వారికీ నిర్వర్తించే భాధ్యతని నా సేవ కైకర్యం అనుకోని నాకు అర్పిస్తే చాలు నేను ఆనందిస్తాను నిరంతం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటె చాలు వారి వెంటే నేను ఉంటాను ఇలానే విష్ణు దాసుడు నాకు ఇష్ట భక్తుడు అయ్యాడు నా పైన నిందలు వేయలేదు భందాలను ఇచ్చినందుకు నా పైన చిరాకు చూపలేదు పిలిచినా నేను పలుకనందుకు భక్తి తో భంధలా కర్మలను అనుభవిస్తూ నన్ను ధ్యానించాడు నన్ను శరణు వెడుతూనే వారి కుటుంబ వ్యక్తులకు న్యాయం చేసాడు విష్ణు దాసుడు చేసి చూపిన భక్తి అంటే నాకు ఇష్టం నారదః అన్నారు విష్ణు దేవులవారు. స్నేహితులారా మనకు స్వర్గం నరకం ఎక్కడో లేదు ఎదుటి వారికీ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమనే తిరిగి వస్తుంది ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి వస్తుంది దీనికి మనం భగవంతుడ్ని తిట్టడం లేదా మన భక్తి తో దేవుడ్ని బయపెట్టడం చేయకూడదు మన భందాలను గౌరవిదాం ప్రేమిదాం సేవిదాం భగవంతునికి ఇష్టులం అవుదాం -
No comments:
Post a Comment