Thursday, March 12, 2026

నా మధుర జ్ఞాపకాలు

 🌹🌹🌹🌹❤️❤️

నా చిన్ననాటి రాజోలు జ్ఞాపకాలు: 50 ఏళ్ల తర్వాత..

- పచ్చని తోరణం: అరవై ఏళ్ల వయసులో, యాభై ఏళ్ల క్రితం వదిలేసిన జ్ఞాపకాలు, ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టగానే.. ముందుగా స్వాగతం పలికింది.

- ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు. గాలికి ఊగే ఆ ఆకులు ఏదో రహస్యం చెబుతున్నట్లు ఉన్నాయి. పక్కనే పచ్చని వరి పొలాలు, ఆ గట్ల మీద నడుస్తుంటే అప్పట్లో మనం పడ్డ పరుగులు గుర్తున్నాయా? అన్నట్లు పలకరించాయి. ఈ పచ్చదనం కంటికి మాత్రమే కాదు, మనసుకి కూడా ఒక కొత్త వెలుగునిచ్చింది.


-  గోదావరి గాలి.. ఆత్మీయ వెటకారం: గోదావరి రేవుకి వెళ్లగానే ఆ నీటి వాసన, చల్లని గాలి నన్ను 45-50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. పడవ ఎక్కగానే ఆ పడవాయన అడిగే పలకరింపులో కోనసీమకే సొంతమైన ఆ ప్రేమ తో కూడిన వెటకారం వినిపించింది. "ఏమండీ కరణం గారిఅబ్బాయిగారూ.. ఇన్నేళ్లకి గుర్తొచ్చిందా మా గోదారమ్మ?" అని ఆయన అడుగుతుంటే.. అందులో కోపం కన్నా, "మా ఊరిని వదిలి ఎక్కడికి వెళ్లారయ్యా?" అన్న ఆత్మీయత ఎంతో అమాయకంగా ధ్వనించింది. ఆ మాటల్లోని గడుసుతనం, ఆ కళ్లలోని స్వచ్ఛత ఇక్కడే దొరుకుతాయి.


-  గురువుగారి పాదచెంత: స్కూలు బిల్డింగ్ అలాగే ఉంది.. నాటి క్లాస్ రూమ్స్ అదే నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి. కానీ, అక్కడ రాధాకృష్ణ మాస్టారిని చూడగానే నా వయసు మర్చిపోయి మళ్ళీ చిన్న పిల్లాడినైపోయాను. నా సొంత అక్కలతో కలిసి ఆయనకు నమస్కరిస్తుంటే, ఆ రోజుల్లో ఆయన వేసిన బెత్తం దెబ్బలు కూడా తీపి జ్ఞాపకాలుగా అనిపించాయి. "గుర్తుపట్టారా మాస్టారూ?" అని అడగడంలో నా అమాయకత్వం.. "నిన్నెలా మర్చిపోతాను నాయనా" అన్న ఆయన చూపులోని గాంభీర్యం.. ఆ క్షణం నా జీవితం ధన్యమైంది.


-  లంక గ్రామాల్లోని ఆ మట్టి ఇళ్లు, మనుషుల మధ్య ఉండే ఆత్మీయత చూస్తుంటే.. మనం సిమెంట్ అడవుల్లో ఏవో కోల్పోతున్నామనిపించింది. 50 ఏళ్ల క్రితం వదిలేసిన ఆ పసివాడి మనసుని రాజోలు వీధుల్లో, గోదావరి అలల మీద మళ్ళీ వెతుక్కున్నాను. ఈ ప్రయాణం కేవలం ఒక విహారం కాదు.. అది నా అస్తిత్వాన్ని నేను మళ్ళీ పలకరించుకోవడం.


- ఒక చిన్న కవిత: "కొబ్బరి తోటల నీడలు మారినా.. గోదావరి అలల సవ్వడి ఆగినా.. రాజోలు మట్టి గుండెల్లో దాచిన నా బాల్యం.. గురువుగారి ఆశీస్సుల్లో వెతికిన అమరత్వం!"

- జీవితంలో కొన్ని క్షణాలు మనసులోశాశ్వతంగా నిలిచిపోతాయి. 

🌹🌹🌹🌹🌹🌹

భీమవరం జ్ఞాపకాలు :

❤️❤️❤️❤️❤️❤️


భీమవరం లో నేను 6 వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీ పాలూరి గంగమ్మ ఓరియంటలు సంఖ్తృత పాఠశాల లో చదివాను. ఆ స్కూల్ చూద్దామని, వెదికి వెదికి వెళ్ళితే అక్కడ స్కూల్ లేదు దాని స్థలంలో ఒక శివాలయం ఉంది. కానీ దాని పక్కనే ఉన్న చిన్నగా ఉన్న మా స్కూల్ బోర్డు చూసి చాలా సంతోషం వేసింది. 


మా గురువులు తెలుగు నేర్పిన శ్రీ సత్యనారాయణ రావు గారు, సం్కృతం నేర్పిన విశ్వనాధ్ గారు, సూర్య కుమారి మేడం గుర్తు వచ్చారు. సంధులు, సమాసాలు రాకపోతే  రూళ్ళ కర్ర తో కొట్టిన దెబ్బలు గుర్తు వచ్చాయి. అలాగే నా స్నేహితులు  జ్యోస్యుల గోపి, చిన్నబాబు రావు,బ్రహ్మం, సూర్య భాను, రాజ్యలక్ష్మి మెదలగు మిత్రులు గుర్తు వచ్చి మనస్సులో ఆనందం కలిగింది.


భీమవరం లోని నా పాత ఇంటి స్థలాన్ని చూసినప్పుడు, అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కనిపించడం నా హృదయాన్ని బాధతో నింపింది. ఒకప్పుడు మనసుకు ఆత్మీయత ఇచ్చిన స్థలం ఇప్పుడు వాణిజ్యానికి మారిపోవడం, కాలం ఎంత మార్పు తీసుకువస్తుందో గుర్తు చేసింది.


ఆ బాధను వెంటనే భక్తి, ఆనందం నింపాయి. మావుళ్ళమ్మ గుడి, గుణుపూడి లోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం (పంచారామం),  అంతర్వేది శ్రీ లక్ష్మి నర్సింహస్వామి దర్శనం, అన్న చెల్లుల తీర్ధం, గోదావరి, సముద్రం కలయిక, అక్కడ తీసుకున్న ఫోటోలు నా మనసుకు శాంతి ఇచ్చాయి. ఆ పవిత్రతలో నేను మునిగిపోయాను.


తర్వాత చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) బాలాజీ దర్శనం, పాలకొల్లు లోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి (పంచారామం), అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క బంగారు విగ్రహం— ఇవన్నీ నా హృదయాన్ని భక్తి, భావోద్వేగంతో నింపాయి. ప్రతి ఆలయం, ప్రతి దర్శనం నా మనసులో ఒక కొత్త వెలుగును వెలిగించింది.


ఈ యాత్ర ముగిసిన తర్వాత, నా హృదయం ఒకే మాట చెప్పింది: “ఈ జన్మకు ఈ జ్ఞాపకాలు చాలు .” ఎందుకంటే నేను నా సొంత సిస్టర్స్ తో కలిసి పుట్టిన ఊరు, చదివిన ఊరు, పాత స్కూల్ జ్ఞాపకాలు అన్నీ మళ్లీ అనుభవించాను.


జీవితం అనేది కేవలం ముందుకు సాగడం కాదు, వెనక్కి చూసి మనసులో నిలిచిన జ్ఞాపకాలను మళ్లీ ఆస్వాదించడం కూడా.

 రాజోలు,భీమవరం,చిన్న తిరుపతి (ద్వారక తిరుమల)అంతర్వేది, పాలకొల్లు ఆలయాలు ఇవన్నీ నా జీవితాన్ని ధన్యంగా మార్చాయి. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.


ఈ రోజు నేను క్లాస్ వన్ gazetted officer గా,మేనేజర్ గా హైదరాబాద్ లోని భారత అణు ఇందన సంస్థలో సేవ చేసే భాగ్యం కలగడం, ఆ దేవ దేవుడుకలియుగ ప్రత్యక్ష డైవం శ్రీ ఏడుకొండలవాడు, శ్రీ సమర్ధ సద్గురు శ్రీ షిరిడీ సాయి దయ మరియు కృప కటాక్షం 🙏

అలాగే స్వర్గీయ నా తండ్రి శ్రీ కస్తూరి సూర్య నారాయణ లక్ష్మి పతి రావు గారు, తల్లి శ్రీమతికస్తూరి మహాలక్ష్మి గారు కారణం, వారికి నా శత కోటినమస్కారములు 🙏🙏🙏నేను పుట్టిన ఊరు రాజోలు, పెరిగిన ఊరు భీమవరం, గురువులు, పాఠశాలలు, అక్క చెల్లుళ్లు, అన్న తమ్ములు, మరియు కస్తూరి కుటుంబ సభ్యులు,నా ధర్మ పత్ని, కొడుకు, కూతురు, కోడలు, మనమరాలు, అప్త మిత్రులు అందరికి కూడా, పేరు పేరునా నా ధన్యవాదములు 🙏🙏

ఈ జన్మకు ఈ  అనుభవం చాలు,ఏమంటారు మిత్రులారా 👍

❤️❤️ఇట్లు 

మీ కస్తూరి వేంకట శ్రీనివాస రావు, రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్, NFC, హైదరాబాద్. ❤️❤️❤️❤️❤️

No comments: